
- బీజేపీ నేతలకు పొన్నం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేపట్టి, చట్టం చేసి కేంద్రానికి పంపించామని, దానిని ఆమోదింపజేసుకునే బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మీరు ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా? బీసీ సంఘాలు మేధావుల వద్ద మేం ఏ రకంగా బీసీ కులగణన చేపట్టామో వారికి వివరించాం. వారందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కానీ, మీరు మాత్రం కాళ్లలో కట్టెపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని మండిపడ్డారు.
‘‘మహారాష్ట్రలో బీసీ కులగణన చేస్తామని అసెంబ్లీ లో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారు. బిహార్‌లో కుల గణన చేపట్టి ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే ఆర్జేడీ.. జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చేసింది. జార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను జైల్లో వేశారు. అటువంటి చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానిది” అని ఆరోపించారు.