హాస్టల్ విద్యార్థుల హెల్త్ విషయంలో అప్రమత్తంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

హాస్టల్ విద్యార్థుల హెల్త్ విషయంలో అప్రమత్తంగా ఉండండి:  మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు కురుస్తుండటం, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీసీ గురుకుల అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురువారం బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టళ్లలోని తాజా పరిస్థితులపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాలమాయదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, జాయింట్ సెక్రటరీ తిరుపతిలు పాల్గొన్నారు. విద్యార్థులకు విధిగా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.