
రాష్ట్రంలో అన్ని కులాల వారిగా లెక్కలు చేపడతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అసెంబ్లీలో కులగణన బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తాను ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తినే అని అన్నారు. రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్తున్న తీర్మానం ఇదని అన్నారు.
మంత్రి వర్గ తీర్మానం తర్వాతే ఈ బిల్లుకు ఆమోదం తెలిపామని మంత్రి గంగుల అన్నారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2011లో చేసిందని చెప్పారు. బలహీన వర్గాలకు ఈ బిల్లుతో మేలు జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.