డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఓట్లు అడుక్కోండి: మంత్రి పొన్నం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఓట్లు అడుక్కోండి: మంత్రి పొన్నం

కరువును కూడా రాజకీయ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హరీష్ రావు.... మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరిచడం దురదృష్టమన్నారు. వర్షాలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణలో కరువు ఏర్పడుతుందని.. ఈ వాస్తవం గుర్తుంచుకోవాలని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫి పొందిన రైతులనే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్న హరీష్ రావుకు పొన్నం కౌంటర్ ఇస్తూ.. గతంలో మీరు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు. బుధవారం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి మా మోపిందని... 10 ఏళ్ల రూ.7 లక్షల కోట్లు  అప్పులు చేశారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు పొన్నం. కేంద్రం ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతామన్నారు.మీ లాగా మేం వక్తుల కోసం కాదు.. రాష్ట్రం కోసం పని చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. అకాల వర్షాలతో నష్ట పోయిన రైతులకు  నష్టపరిహారం ప్రకటించామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందనే  ముర్ఖులు మాత్రమే చెప్తున్నారని మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  కట్టినది మిరే.. కూల్చినది మిరేనని విమర్శించారాయన.  ఆర్టీసీని బిఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిందని.. మా ప్రభుత్వం వచ్చాక లాభాలతో నడుస్తుందని చెప్పారు. టెట్ ఫీజ్ అంశంపై ఆలోచిస్తున్నామని.. బోర్డు కచ్చితంగా తగ్గిస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.