ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకే హెల్త్ క్యాంపులు : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకే హెల్త్ క్యాంపులు : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే  ప్రభుత్వం హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తుందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ లో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు.

 దవాఖానకు పోకుండా హెల్త్ క్యాంపులో అన్ని పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స కోసం ఆసుపత్రికి పంపించేలా ఇక్కడ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ లో 169 బస్తీ దవాఖాన లు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ,11 స్పెషాలిటీ ఆసుపత్రులు  నగరంలో ఉన్నాయని,30 ఏరియాల్లో ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్, కలెక్టర్ హరిచందన, కార్పొరేటర్లు పాల్గొన్నారు.