ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ. 11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్ళలో విద్య నిర్వీర్యం అయ్యిందని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు.
అలియా పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని 1872లో స్థాపించారని తెలిపారు. విద్యార్థులు ఆసక్తితో చదవడంతో పాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. రాజకీయలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు పొన్నం ప్రభాకర్.