- కరీంనగర్, గోదావరిఖనిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు
కరీంనగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్- డిస్ట్రిక్ట్ టీ 20 లీగ్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ను కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆగంరావు గురువారం రిలీజ్ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 4 వరకు కరీంనగర్ అలుగునూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్‌లో, ఈ నెల 4, 5 తేదీల్లో గోదావరిఖని ఎన్‌టీపీసీ గ్రౌండ్‌లో పోటీలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ కు సంబంధించి ఇప్పటివరకు 9 రోజుల్లో 65 మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. వచ్చే 17 రోజుల్లో మరో 39 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్‌లకు తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 180 మంది క్రికెటర్లు, హెచ్ సీఏ ఆఫీసర్లు హాజరుకానున్నట్లు ఆగంరావు తెలిపారు.
సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ఇలా..
కరీంనగర్ అలుగూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మెదక్ వర్సెస్ ఆదిలాబాద్, మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ వర్సెస్ కరీంనగర్, శనివారం ఉదయం 9.30 గంటలకు నల్గొండ వర్సెస్ వరంగల్, మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం వర్సెస్ మహబూబ్ నగర్, 4న ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్ వర్సెస్ రంగారెడ్డి, మధ్యాహ్నం 1.30 గంటలకు మెదక్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నెల 4న ఉదయం 9.30 గంటలకు గోదావరిఖని ఎన్టీపీసీ గ్రౌండ్ లో నల్గొండ వర్సెస్ ఆదిలాబాద్, మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం వర్సెస్ కరీంనగర్, 5న ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్ వర్సెస్ వరంగల్, మధ్యాహ్నం 1.30 గంటలకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీమ్ ల మధ్య మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
