ధరణిలో కొన్ని భూ సమస్యలు ఉన్నాయి

ధరణిలో కొన్ని భూ సమస్యలు ఉన్నాయి

హైదరాబాద్, వెలుగు: ధరణిలో కొన్ని భూ సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించామని, మరికొన్నింటికి మాడ్యూల్స్​రెడీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నోటరీల రిజిస్ట్రేషన్ పరిశీలనలో ఉందని వెల్లడించారు. అసెంబ్లీలో రెవెన్యూ పద్దుపై ఆయన శుక్రవారం మాట్లాడారు. రెండో ఫేజ్​సాదా బైనామాల పరిష్కారంపై హైకోర్టులో కేసు ఉన్నందున.. అది తేలిన వెంటనే ప్రాసెస్​పూర్తి చేస్తామన్నారు. ఫస్ట్​ఫేజ్ లో11 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే 6 లక్షల అప్లికేషన్లు పరిష్కరించినట్లు వివరించారు. కోటి 52 లక్షల ఎకరాల భూమికి సంబంధించి 66 లక్షల మంది రైతులకు కొత్త పాస్ బుక్ లు అందాయన్నారు.

గతంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూమి క్రయవిక్రయాల్లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన15 నిమిషాల్లోనే ఈ-పాస్ బుక్ ఇస్తున్నామని తెలిపారు. మంత్రిగా ఉండే కంటే ముందు తాను రియల్ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు లేవన్నారు. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తయి,17 కార్యాలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సౌలత్​లు పెంచుతామన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్​మెన్స్ ల్యాండ్ సమస్య లపై కాంగ్రెస్​సభ్యులు లేవెనెత్తిన అంశలను  వెంటనే సుమోటోగా స్వీకరించి, పరిశీలన చేస్తామని మంత్రి తెలిపారు.