షర్మిలకు పువ్వాడ సవాల్ 

 షర్మిలకు పువ్వాడ సవాల్ 

వైఎస్సార్ టీపీ  అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్ట్రాంగ్ కౌంటర్  ఇచ్చారు. అన్న వైఎస్ జగన్ తో పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని..ఏం సాధించేందుకు ఆమె తెలంగాణకు వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. దివంగత నేత వైఎస్సార్ ..సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలోజరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గు వేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే పదవులు, టిక్కెట్స్ కేటాయిస్తామని  సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దమ్ముంటే ఖమ్మంలో  తనపై పోటీ చేసి గెలవాలని  షర్మిలకు మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. పనిచేసిన వారిని కేసీఆర్ తప్పక గుర్తిస్తారన్నారు.