టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే నిలబడ్డాయ్ కడ్మయ్ ఖతం: పువ్వాడ అజయ్

టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే  నిలబడ్డాయ్  కడ్మయ్ ఖతం: పువ్వాడ అజయ్

ఏపీ, తెలంగాణ చరిత్రలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే నిలబడ్డాయని, మిగతా పార్టీలన్నీ కనుమరుగైపోయాయని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. వైరా నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  కేసీఆర్ ఎవరికి అన్యాయం చేయలేదని, రాష్ట్ర విభజన సమయంలో గొంగళి పురుగు లాంటి వ్యక్తులను కూడా కేసీఆర్ దగ్గరికి తీసుకున్నారని అన్నారు. రాష్ట్రం సాధించే క్రమంలో కేసీఆర్ కు ఎదురొచ్చిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారని పువ్వాడ కామెంట్ చేశారు, పార్టీని తొక్కేస్తామని బెదిరించినా కష్టపడి నిలబెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ దమ్మేంటో అందరికీ తెలుసునన్న పువ్వాడ.. పార్టీ మీద వ్యక్తులు ఆధారపడి ఉంటారే కానీ వ్యక్తుల మీద పార్టీ ఆధారపడదని చెప్పారు. రాజకీయ నాయకులు సృష్టించిన గడ్డ వైరా అని పువ్వాడ స్పష్టం చేశారు.