వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించిన మంత్రి రోజా

 వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించిన మంత్రి రోజా

కరోనా వల్ల రెండేళ్లుగా క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు ఏపీ మంత్రి రోజా. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ లో శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు రోజా. ఆర్చరీ శిక్షణ శిబిరం దగ్గర బాణం ఎక్కుపెట్టారు రోజా. 48 విభాగాల్లో వేసవి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 1,670 సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఈ శిబిరాల ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తామన్నారు. క్రీడా ప్రాంగణాలు ఆక్రమణల్లో ఉంటే.. వాటిని సంరక్షించి అభివృద్ధి చేస్తామన్నారు. అంతకు ముంద పశ్చిమ గోదావరి జిల్లాలో బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభించారు రోజా.