నిజాం కాలేజీ హాస్టల్ వివాదంపై మంత్రి సబిత సమావేశం

నిజాం కాలేజీ హాస్టల్ వివాదంపై మంత్రి సబిత సమావేశం

నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ వివాదంపై చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ  సమావేశంలో మంత్రి సబితతో  టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెస‌ర్ రవీంద‌ర్ యాద‌వ్, ప్రిన్సిప‌ల్‌ భేటీ అయ్యారు.  హాస్టల్ కావాలంటూ నిజాం కాలేజీ డిగ్రీ స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళన పై మంత్రి ఆరా తీస్తున్నాురు. విద్యార్ధుల సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని మంత్రి  కేటీఆర్ చేసిన సూచన మేరకు మంత్రి సబిత వారితో  సమావేశమైనట్లు తెలిసింది.   

నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డేకు అటెండైన కళాశాల పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్  కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయల ఫండ్  ను కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థులు కొన్ని రోజుల పాటు ఆందోళన నిర్వహించారు.