రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నరు

రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నరు

తెలంగాణ సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తపన పడ్డారో అదే సంకల్పంతో రాష్ట్రాభివృద్ధి కోసం అంతే కృషి చేస్తున్నారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ గురుకులాల విద్యకోసం ఏటా రూ.400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్లను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించే 29 రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. 

ఉపాధ్యాయుల పట్టుదల,  ముఖ్యమంత్రి కృషి తో గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఐఐటీ లో సీట్లు సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ ముందు ఉంచిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గిరిజనుల కోసం పాఠశాల, కాలేజీలు మంజూరు అయ్యే లా ప్రయత్నిస్తానని  హామీ ఇచ్చారు.