రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్

రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్
  • రెండు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తం: మంత్రి సబిత
  • ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో​ టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 81 వేల మందికి ట్రైనింగ్
  • ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసులను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రెండు, మూడు రోజుల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్​రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తామని తెలిపారు. టెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాతే టీఆర్టీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియంలో క్లాసులు బోధించే టీచర్లకు నిర్వహించే శిక్షణా తరగతులను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి సోమవారం ప్రారంభించారు. విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు జనార్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, రఘోత్తం రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియం క్లాసులు ప్రారంభిస్తున్నామని సబిత తెలిపారు. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియంలో క్లాసులు చెప్పే టీచర్లకు ఎస్సీఈఆర్టీ, అజీంప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ వర్సిటీ ఆధ్వర్యంలో రెండు దశల్లో 9 వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 4 వారాలపాటు ఇచ్చే మొదటి దశ శిక్షణలో 363 మంది స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ రిసోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్లకు, మెంటార్లుగా ఉండే 2,683 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఒక్కో విడతలో 16,500 మంది టీచర్లకు, మొత్తం 81,590 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మార్చి 14 నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 52,924 మంది ప్రైమరీ స్కూల్ టీచర్లు, 28,666 మంది హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్లు ఉన్నారని మంత్రి చెప్పారు.

కొందర్నే పిలవడమేంది?: గుర్తింపు సంఘాలు

ఇంగ్లీష్​ ట్రైనింగ్ క్లాసుల ప్రారంభ కార్యక్రమానికి కొంతమంది ఎమ్మెల్సీలను, కొన్ని సంఘాలనే ఆహ్వానించడం సరికాదని యూటీఎఫ్, టీఆర్టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డాయి. సర్కారు బడుల్లో ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియం పెట్టడాన్ని స్వాగతించామని ఆయా సంఘాల నేతలు గుర్తుచేశారు. విద్యాశాఖ అధికారులు ఈ వివక్షను విడిచిపెట్టకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని, గుర్తింపు సంఘాలను పిలవకపోవడం సరికాదని అన్నారు.

విద్యాశాఖ నుంచే ఎక్కువమంది రెగ్యులర్

‘మన ఊరు – మన బడి’ పథకంతో బడులను అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్యాశాఖలో 19 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. 11 వేల మంది కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను పర్మినెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారని, వారిలో ఎక్కువ మంది ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసేవారేనని మంత్రి చెప్పారు. త్వరలోనే టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. 2022–23 విద్యాసంవత్సరంలో 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియం క్లాసులు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. 2024–25 నాటికి వాటిని పదో తరగతి వరకు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. సర్కారు స్కూళ్లలో అభివృద్ధి చేయాల్సిన 12 అంశాలను గుర్తించామని, 7 వేల కోట్లతో వాటిని డెవలప్ చేస్తామని సబిత తెలిపారు.