సామాన్య మహిళతో మంత్రి సబిత వెటకారం

సామాన్య మహిళతో మంత్రి సబిత వెటకారం

సీసీ రోడ్డు వేయడంతో తన ఇల్లు పోయిందని ఓ మహిళ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చెప్పుకుంది. దీనిపై స్పందించిన మంత్రి సబిత.. ఆ మహిళ పేరు కూడా శిలాఫలకం మీద వేయకపోయారా అని వెటకారంగా మాట్లాడారు. ఆ తరువాత మహిళలతో పెన్షన్ ఇస్తున్నది ఎవరని మంత్రి అడగగా.. తెలుగుదేశం పార్టీ అని సదరు మహిళ చెప్పింది. దీంతో అక్కడున్నవాళంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నారని, గుర్తు కారు గుర్తని మర్చిపోవద్దని మహిళకు మంత్రి సూచించారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని వుప్పుగడ్డతండ, మహేశ్వరం గ్రామాల్లో ఏడు కోట్ల 72లక్షల నిధులతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి అన్నారు.