మరో 38 కేజీబీవీల్లో ఇంటర్ విద్య

మరో 38 కేజీబీవీల్లో  ఇంటర్ విద్య
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బా విద్యాలయాలను (కేజీబీవీ) ఇంటర్మీడియెట్ వరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఫస్టియర్ క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. కొత్తగా అప్​గ్రేడ్ అవుతున్న కేజీబీవీల్లో 3,040 సీట్లు ఉంటాయని..రెండు గ్రూపులను అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ నిర్ణయంతో  సర్కారుపై ఏటా రూ. 7.60 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు.  

రాష్ట్రంలో 475 కేజీబీవీలు  ఉండగా వాటిలో ఇప్పటివరకు 245 కేజీబీవీలను ఇంటర్ వరకూ అప్ గ్రేడ్ చేసినట్లు గుర్తుచేశారు. ఆయా కాలేజీల్లో ప్రస్తుతం 26,027 మంది బాలికలు చదువుతున్నారని చెప్పారు. మొత్తంగా 475 కేజీబీవీల్లో 1,33,879 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.