రాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత

రాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను చేతిలో పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులను ఎలా ఇబ్బంది పెడుతోందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగ్ పేటలోని పెద్ద బావిలో మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 

ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు లభించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  తెలంగాణకు శ్రీరామరక్ష లాంటి పాలన అందిస్తున్న కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు విద్యా సంస్థలను కేటాయించిన కేంద్రం..తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిందన్నారు.