బీజేపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది

బీజేపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది

మహబూబాబాద్:  రైతుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న అనుచిత, వ్యతిరేఖ వైఖరిని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. రైతులు పండించే ప్రతి గింజను కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

లక్షల కోట్ల బడ్జెట్ పెట్టె బీజేపీ ప్రభుత్వం.. లక్షల్లో ఉన్న పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది: సత్యవతి రాథోడ్

తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేని బీజేపీ ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యకు నిరసనగా.. రేపు గ్రామగ్రామానా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. సీఎం కేసీఆర్ కి అండగా ఉన్న రైతులను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు ఉత్పత్తి చేశారంటే అది తెలంగాణ రాష్ట్ర సీఎం ఘనతే. యాసంగి వడ్లు కొనబోమంటున్న బీజేపీ నాయకుల మాటలను తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పాలి. దేశంలో ఆకలి చావులు,పేదరికం పెరుగుతున్నాయని అనేక ప్రపంచ దేశాల సర్వేలు చెబుతుంటే.. మోడీ మాత్రం గొప్పలు చెబుతున్నాడు. లక్షల కోట్ల ఉత్త బడ్జెట్ పెట్టె బీజేపీ ప్రభుత్వం.. లక్షల్లో ఉన్న పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక మోడీ  ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నాడు. ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట చెప్పే బీజేపీ నాయకులను రైతులే తరిమికొడుతారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారే చొరవ తీసుకొని సాగు చేసుకుంటున్న రైతులందరికీ త్వరలోనే పట్టాలిస్తారు’ అని మంత్రి సత్యవతి అన్నారు.

గల్లీ పార్టీ ఢిల్లీ పార్టీ అని మాట్లాడే బీజేపీ నాయకులు గల్లీల్లో ఉన్న రైతులకు ఏమి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రశ్నించారు. రేపటి ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

For More News..

పేకాడుతూ అడ్డంగా దొరికిన కార్పొరేటర్ల భర్తలు

భర్తను కాపాడబోయి భార్య కూడా మృతి

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఫిబ్రవరిలో థర్డ్ వేవ్