వీణా, వాణిలకు మంత్రి సత్యవతి బర్త్ డే విషెస్

వీణా, వాణిలకు మంత్రి సత్యవతి బర్త్ డే విషెస్

అవిభక్త కవలలు వీణా, వాణిలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వారికి  భగవంతుడు ఆయురారోగ్యాలు కలుగజేయాలని ప్రార్థించారు. వీణా, - వాణీలు తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలని, వారిని తమ ప్రభుత్వం సొంత పిల్లలుగా చూసుకుంటుందని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడేనికి చెందిన మురళి,- నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్ 16న వీణా, వాణిలు జన్మించారు. హైదరాబాద్ లోని చిల్డ్రన్స్ హోమ్ లో వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు మంత్రే స్వయంగా ఎప్పటికప్పుడు వారి బాగోగులు అడిగి తెలుసుకుంటూ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల్లో వీణా-వాణి లు సత్తా చాటడం అనేది వారికి చదువు పట్ల ఉన్న కృషి పట్టుదలకు నిదర్శనమని మంత్రి అన్నారు. వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో చేసే సాధన అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల వారిని కలసి మాట్లాడినప్పుడు, తాము భవిష్యత్ లో సీఏ చదవాలని అనుకుంటున్నామని మంత్రికి తెలిపారు. వారి కోరిక మేరకు సీఏ చదివించేందుకు మంత్రి సత్యవతి తగిన ఏర్పాట్లు చేశారు. వీణా, - వాణిలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా వారి బాగోగులు చూసుకుంటున్న అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు.