వినతిపత్రాలు ఇస్తే ఏమి చేశారు ? 

వినతిపత్రాలు ఇస్తే ఏమి చేశారు ? 

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇస్తే ఏమి చేశారని ప్రశ్నించారు. సదరన్ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ గైర్హాజర్ అయ్యారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. సదరన్ స్టేట్ కౌన్సిల్ సమావేశ విషయంలో అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సమావేశాలకు  వెళ్ళామని చెప్పారు. రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కులను కేంద్రం కావాలని  అమలు చేయడం లేదన్నారు. ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో గర్భవతుల మహిళలకిఇచ్చే న్యూట్రీషియన్ కిట్, పిల్లలకిచ్చే మాల్ న్యూట్రిషియన్ కిట్ లపై చర్చిస్తామన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు, అధికారులతో హాస్టల్ స్కూల్ ల పరిస్థితులపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 

మరోవైపు.. కేరళలోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరు కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గైర్హాజర్ అయ్యారు. రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు ముఖ్య ఉద్దేశంగా సమావేశం జరుగనుంది. ఫెడరలేజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ సమావేశం జరుగుతుంది.