సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడి పథకంలో భాగంగా పునరుద్ధరించిన ప్రభుత్వ పాఠశాలలను ఆమె ఇవాళ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మన ఊరు–మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్‌ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.  సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7200 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేసిందని వెల్లడించారు.