సీపీఐ నారాయణతో కలిసి వాకింగ్ చేసిన మంత్రి సత్యవతి

 సీపీఐ నారాయణతో కలిసి వాకింగ్ చేసిన మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి సత్యవతి రాథోడ్ ముచ్చటించారు. మార్చి 27వ తేదీ సోమవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ మంత్రికి తారసపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆయనతో కలిసి వాకింగ్ చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జిమ్ ఫెసిలిటీస్ బాగున్నాయని సీపీఐ నారాయణ మంత్రికి తెలిపారు.

వాకర్స్ సమస్యలు, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో కాసేపు చర్చించారు నారాయణ. ఎన్టీఆర్ స్టేడియం ఆభివృద్ధికి మరింత కృషి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.