
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. ‘‘ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులతో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు. హరీశ్ రావు నియోజకవర్గం సిద్దిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు. బీఆర్ఎస్ హయాంలోనే అడ్వకేట్ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్ఎస్” అని మండిపడ్డారు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగిందన్నారు. హరీశ్ చెప్పిన మాటల్లో నిజం లేదని తెలిపారు.