- కాంగ్రెస్ అండగా ఉంటది: మంత్రి సీతక్క
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ బిడ్డ, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో బీసీలతో బోరబండలో సమావేశం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు అండగా ఉంటూ జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. బీసీలంతా నవీన్‌కు అండగా నిలవాలి’’అని కోరారు. అనంతరం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడారు. ప్రభుత్వం బీసీలపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదన్నారు.
బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ గెలుపు.. బీసీల గెలుపని, ప్రతి బీసీ కుటుంబం నవీన్‌కు ఓటు వేసి తమ ఉనికిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, పార్టీ నేతలు యుగంధర్ యాదవ్, కిషోర్, అశోక్, వంగ రవి, శ్రీనివాస్, పోషాల సరస్వతి, గుండేడి ఐలయ్య యాదవ్, గుండు దయానంద్, టి.హనుమంత యాదవ్, సీహెచ్ వెంకన్న, రమేశ్ బొల్ల, జగన్ యాదవ్ శారద, లక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు.
