ఈశ్వరి బాయి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు మంత్రి సీతక్క. రవీంద్ర భారతీలో జరిగిన ఈశ్వరీ బాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న సీతక్క.. తెలంగాణలో అత్యంత గౌరవప్రదమైన ఈశ్వరి బాయి ఫౌండేషన్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఈశ్వరి బాయి సేవలు చిరస్మరణీయమని చెప్పారు. అలాంటి గొప్ప మహిళా నాయకురాలు ఈశ్వరిబాయి పేరిట అవార్డు అందుకోవడం తన జీవితంలో ఒక గొప్ప విశేషమన్నారు.
సమాజంలో మహిళలకు విద్యతోనే భవిష్యత్తు ఉంటుందని గుర్తించి మహిళా సాధికారత కోసం ఈశ్వరి బాయి అందించిన సేవలు మరిచిపోలేనివన్నారు. అంబేద్కర్ సూచించిన హక్కులు సమాజంలో ఎంతో మందికి గొప్ప అవకాశాలు కల్పించాయన్నారు. ఆదివాసి గిరిజన కుటుంబంలో జన్మించిన తనకు ఈశ్వరి బాయి అవార్డు అందుకునే అవకాశం రావడం అంబేద్కర్ ఆలోచనే కారణమని చెప్పారు. సమాజంలోని ప్రజలందరూ అంబేద్కర్ సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా పోరాడాలని కోరారు సీతక్క.
►ALSO READ | ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు GHMC లో విలీనానికి గవర్నర్ ఆమోదం
