వచ్చే ఏడాది జాతరలోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి సీతక్క

వచ్చే ఏడాది జాతరలోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి సీతక్క

మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర పంచాయీతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.  తమ గ్రామానికి వచ్చిన మంత్రి సీతక్కకు పునుగొండ్ల ప్రజలు, పగిడిద్దరాజు పూజారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత పగిడిద్దరాజు పూజారులకు మంత్రి.. కొత్త బట్టలు, డోలీలు అందజేశారు. పూనుగొండ్ల ప్రజలు  మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించారు.

అనంతరం సీతక్క మాట్లాడుతూ.. మళ్ళీ వచ్చే జాతర సమయంలోపు పూనుగొండ్లలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న మేడారం మహాజాతరను విజయవంతం చేయాలని కోరారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అందరూ వచ్చి సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 20వ తేదీన పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు మేడారం బయల్దేరి వెళ్లనున్నారు.