ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు : మంత్రి సీతక్క

ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు :  మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని, వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని పంచాయతీరాజ్, రూరల్​ డెవలప్​మెంట్​శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న డెవలప్ మెంట్ పనులు ఆగొద్దని అన్నారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. స్వచ్ఛభారత్, ఉపాధి హామీ, సీసీ రోడ్లు, ఇతర స్కీమ్ లపై చర్చించారు.  

పెండింగ్ లో ఉన్న తమ జీతాలు విడుదల చేయాలని మంత్రి సీతక్కను ఉపాధి హామీ ఉద్యోగులు ఇటీవల కోరగా, అధికారులను ఆదేశించి రూ.46 కోట్లు జీతాలు విడుదల చేయించారు. సర్పంచ్​లు అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీల్లో  పనులు చేశారని, వారికి రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ స్కీమ్​లో జీపీ బిల్డింగ్ ల నిర్మాణం, అంగన్ వాడీ, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు ప్లాన్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు.