అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్: మంత్రి శ్రీధర్ బాబు

అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్: మంత్రి శ్రీధర్ బాబు

నివాస, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు నిరంతరాయంగా కరెంట్ అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 2014 కు ముందే 24 గంటల కరెంట్ ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

మా ప్రణాళికల వలన మీరు బీఆర్ ఎస్ ప్రభుత్వం ఫలితాలు అనుభవించిందని శ్రీధర్ బాబు చెప్పారు. కేవలం యాదాద్రి, భద్రాత్రి పవర్ ప్లాంట్ లు మాత్రమే బీఆర్ ఎస్ హయాంలో తీసుకొచ్చారు. నేషనల్ గ్రిడ్ కోసం 2013లో నే కాంగ్రస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అది 2017లో పూర్తి అయిందని శ్రీధర్ బాబు చెప్పారు. 

ప్రజా అవసరాలకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు శ్రీధర్ బాబు. అప్పులు అడ్డగోలుగా చేశారని. ఒక్కో వ్యక్తిపై 7లక్షల రుణభారం ఉందన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉండేలా తీర్చిదిద్దతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.