డ్రగ్స్ వాడితే నగర బహిష్కరణే

డ్రగ్స్ వాడితే నగర బహిష్కరణే

హైదరాబాద్: డ్రగ్స్ అమ్మితే పీడి యాక్ట్ పెడతామని, అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శనివారం పబ్ ఓనర్లతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  నగరంలో మొత్తం 61 పబ్స్ ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలు లేని పబ్బులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పబ్బులలోని సీసీ కెమెరాలను ఎక్సైజ్ శాఖకు చెందిన ఐటీ విభాగానికి అనుసంధానం చేయాలని పబ్ ఓనర్లను సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కూడా పబ్బులను సమయానికి మించి నడపరాదని చెప్పారు. పబ్బులలో ఎలాంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

ఇక పబ్ ఓనర్లు కూడా పలు విషయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి పబ్ లో కనీసం ఒక కానిస్టేబుల్నైనా ఉంచాలని కోరారు. అన్ని పబ్బులలో సీసీ కెమెరాలు పెట్టామని, క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి పబ్ లో బౌన్సర్లను పెట్టామని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమిస్తున్నామన్నారు. ఎవరో ఒక్కరూ చేసిన తప్పుకు ప్రతి ఒక్కరినీ నిందించడం సరికాదని మంత్రి వాపోయారు. 

మరిన్ని వార్తల కోసం

చిరు సినిమాలో పూరీ స్పెషల్ రోల్

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​