ఇంట్లో ఉంటేనే నిజ‌మైన‌ దేశ భక్తులు

ఇంట్లో ఉంటేనే నిజ‌మైన‌ దేశ భక్తులు

కరోనా.. మన మహబూబ్ నగర్ జిల్లాలో స్ప్రెడ్ అయ్యింది.. కానీ అధికారులు ముందే పసి కట్టారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. క‌రోనాపై శుక్ర‌వారం ఆయ‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మాట్లాడారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 350 మంది ఉన్నారని.. వీరి గురించి అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నామ‌న్నారు. అందుకే కొన్ని కేసులు వచ్చాయని.. లేకుంటే చాలా ఉండేవన్నారు. అయినా కేసులు రావడం బాధకారమేన‌న్న శ్రీనివాస్ గౌడ్.. 327 మందిని క్వరంటీన్ చేశామ‌న్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించామ‌ని.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 3 ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చాయని.. 2 ఢిల్లీ నుంచి వచ్చిన వారని తెలిపారు. 2 ఢిల్లీ నుంచి వచ్చిన వారినుంచి సంక్రమించాయని..వైరస్ వ్యాప్తి జరుగుతుందని గుర్తించిన వారు హోమ్, హాస్పిటల్, క్వారైంటైన్ల‌లో ఉంచామన్నారు.

ఇప్పటికి వ్యాధి సదరు కుటుంబ సభ్యుల మధ్యనే ఉంది.. కానీ ఎవ్వరికి ఉందొ చెప్పలేము.. గుంపుగా ఉంటే ఇబ్బంది వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో అసత్యాలు వస్తున్నాయని.. ఇవి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని తెలిపారు .ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం.. ఇప్పటికే ఇలాంటి తప్పులు చేసిన వారిని ఇద్దరిని జైల్లో పెట్టారన్నారు. అందరూ బాధ్యతతో మెలగాలని.. మార్కెట్ లో అన్నీ సవ్యంగా ఉన్నాయన్నారు. మార్కెట్ లోకి వెళ్ళినపుడు జాగ్రత్తలు పాటించాల‌ని.. టౌన్ లో ప్రమాద హెచ్చరికలు మొగుతున్నాయని తెలిపారు.

ఇంట్లో ఉంటేనే నిజ‌మైన‌ దేశ భక్తులు

దయచేసి.. ఢిల్లీ నుంచి వచ్చిన వారు సిబ్బందికి సహకరించాల‌ని… మీరు ఇంట్లో ఉండి.. సహకరిస్తే .. మీరు దేశాన్ని కాపాడిన వారు అవుతారు… మీరు ఇంట్లో ఉంటేనే నిజ‌మైన‌ దేశ భక్తులు అన్నారు. బ్యాంకుల్లో ఎక్కువ మంది ఉండొద్దని గుంపులు గుంపులుగా రావద్దన్నారు. స్వయం నియంత్రణ పాటించాల‌న్నారు. ఫైర్, మునిసిపల్ సిబ్బంది వీధుల్లో పారిశుధ్య కార్యక్రమంలో ఉన్నారని..అలాగే డాక్ట‌ర్లు దేవుడితో సమానం… వారిని తిడితే.. దాడి చేస్తే.. దేవుడిపై దాడి చేసినట్లేఅన్నారు. ఇప్పటి దాకా 2240 ఇళ్లను శుద్ధి చేశామ‌ని మీరు ఇంట్లో ఉండి సహకరించాల‌న్నారు. ఇంకా అధికారుల దృష్టికి రాని వారుంటే స్వచ్చందంగా రావాలి.. అలాంటి వారు ఉంటే సమాచారం ఇవ్వాల‌ని సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.