షేక్ పేటలో నాలా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

షేక్ పేటలో నాలా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

షేక్ పేటలో నాలా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) షేక్ పేట డివిజన్ లోని హకీంశాకుంట కాలనీలో మసీద్ దగ్గర వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి వివేక్. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాలా వరద నీరు ఇళ్లలోకి చేరుకొని ఇబ్బంది పడుతున్న స్థానికులను పరామర్శించారు. ఈ క్రమంలో నాలా వరద బాధితులు తమ సమస్యలను మంత్రి వివేక్ వెంకటస్వామికి చెప్పుకున్నారు.

క్షేత్రస్థాయిలో వరదనీరు ఇళ్లలోకి చేరిన ప్రబావితమవుతున్న ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వివేక్ త్వరలోనే నాలా వరద సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వక్ఫ్ బోర్డు చైర్మెన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

ఇదిలా ఉండగా.. నిజాంపేట్ రాజీవ్ రాజీవ్ గృహకల్ప కాలనీ దగ్గర  నల్లమల్లిస్ ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గిన్నారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. సొంత పైసలతో మహిళలకు సేవ చేస్తున్న నల్లమల్లిస్ మహిళా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని.. వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మాట్లాడతామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తోందని అన్నారు మంత్రి వివేక్.