
హైదరాబాద్, వెలుగు: తన హత్యకు కుట్ర పన్నుతారని ఊహించలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తన ఉద్యోగ, ప్రజా జీవితంలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. నలుగురికి సాయం చేశానే తప్ప దుర్మార్గమైన ఆలోచనలు చేయలేదని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, విచారణలో అన్ని విషయాలు బయటపడుతాయని తెలిపారు. శనివారం శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ గెజిటెడ్ సంఘం నేతలు మమత, సత్యనారాయణ, వెంకట్, కృష్ణయాదవ్‌తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో చిట్ చాట్ చేశారు. వారం కిందే తన హత్యకు కుట్రపై పోలీసులకు సమాచారం అందినట్లు తనకు తెలిసిందన్నారు. అయితే 6 నెలల కిందటే తన హత్యకు ప్లాన్ చేశారని పోలీసుల ద్వారా తెలిసిందని తెలిపారు.