
ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. వారి కుట్రలను ఏ మాత్రం సహించేది లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తనని... ప్రజలే కాపాడుకుంటారని అన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన మహిళా దినోత్స వేడుకల్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన స్టేడియంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 142 మహిళా సంఘాలకు Rs 7,50,00,000 విలువ గల చెక్కులను అందచేయడం జరిగింది. pic.twitter.com/d02IkRamw9
— V Srinivas Goud (@VSrinivasGoud) March 8, 2022