రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు : మంత్రి తలసాని

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు : మంత్రి తలసాని

సంచలనం సృష్టించడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ రద్దు,  ముందస్తు ఎన్నికలు అని  అంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనవి ఉత్త గాలి మాటలేనని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని  ప్రజలు ఎన్నుకున్నారని... డిసెంబర్ వరకు ఎన్నికలకు పోయే ఆలోచనే లేదన్నారు. ప్రజలు ఇలాంటివి నమ్మోద్దని సూచించారు. సంవత్సరానికి మూడు పంటల వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  తలసాని తెలిపారు. 

ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందని, రాష్ట్రపతి పాలన వస్తుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు.  వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.