బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

ఈ ఏడాది 18 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన ఇవాళ బన్సీలాల్ పేటలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలకు 340 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి తలసాని అన్నారు. మహిళలు ఇబ్బంది పడకుండా రేషన్ షాపుల దగ్గరే చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. 

తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మనకు గర్వకారణం అని మంత్రి తలసాని అన్నారు. ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తుందన్నారు. ప్రజలందరూ పండుగలను గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు.