డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రి.. మహిళల ఆందోళన

డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రి.. మహిళల ఆందోళన

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్ లో డబుల్ బెడ్రూం లబ్ధిదారులు ఆందోళన దిగారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న తమకు ఇళ్లు ఇవ్వలేదని స్థానిక మహిళలు నిరసనకు చేపట్టారు. కొంత మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం 210 డబుల్ బెడ్రూం ఇల్లు ఇక్కడ నిర్మించగా..126 లబ్ధిదారులు ఉన్నారని.. ఇందులో ప్రస్తుతం 86 మందిని మాత్రమే లబ్ధిదారులను గుర్తించారని మహిళలు చెబుతున్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

మే 18వ తేదీ గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కమలా నగర్ లోని 210 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం పలువురికి డ్రా తీసి ఇళ్ళ పట్ట, తాళాలను అందజేసిన మంత్రి తలసాని. ఈ ఇళ్ల నిర్మాణం మొత్తం రూ.16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టారు. రూ.15 .50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఈ కాలనీకి 100 కె.ఎల్ లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటుగా 15 షాపులు కూడా ఏర్పాటు చేశారు.