నేచర్ క్యూర్లో నేనూ ట్రీట్మెంట్ తీసుకున్నాను: మంత్రి తలసాని 

నేచర్ క్యూర్లో నేనూ ట్రీట్మెంట్ తీసుకున్నాను: మంత్రి తలసాని 

నేచర్ క్యూర్ ఆస్పత్రిలో తాను కొన్ని రోజులు పేషెంట్ గా ట్రీట్మెంట్ తీసుకున్నానని..ఈ ఆస్పత్రిలో వారం రోజులు జాయిన్ అయినా ఆయుషు పెరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ శనివారం హైదరాబాద్ బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో రెన్యువేట్ చేసిన సౌకర్యాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని.. వికారాబాద్ లో ఇలాంటి హాస్పిటల్ డెవలప్ చేయాలని సూచించారు. 10 కోట్ల తో నేచర్ క్యూర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ అన్ని బాగున్నాయి.. కానీ నియామకాలు చేపడితే ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. 

ఆస్పత్రిలో నియామకాల దిశగా ఆరోగ్య శాఖ ఆలోచించాలని కోరుతున్నామని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. హెల్త్ మినిస్టర్ వల్ల రాష్ట్ర ప్రజలకు.. పేషెట్లకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం వచ్చిందని.. ఆరోగ్య శాఖ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,CS శాంత కుమారి,TSMIDC ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.