బోనాలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు

బోనాలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు

మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి తలసాని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ బోనాల పండుగకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈక్రమంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని..బోనాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, మంత్రి వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్,వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్,ఇతర అధికారులు ఉన్నారు.