కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడు

కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడు

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, డ్రెస్సింగ్ రూమ్‌లు తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. ఫతే‌నగర్ బ్రిడ్జిని రాబోయే రోజుల్లో వైడనింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు సనత్ నగర్‌ను విస్మరించాయని.. ఆ విషయాన్ని ఇప్పుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళామని ఆయన తెలిపారు.

‘చెప్పిన వెంటనే అభివృద్ది పనులు చేపట్టండంటూ నిధులు కేటాయించడానికి కేటీఆర్ సిద్ధం అయ్యారు. నగర అభివృద్ధి కోసం కేటీఆర్ ఇన్ని వందల కోట్లు కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం. దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. నిర్మాణానికి
కొంచెం ఆలస్యం అవ్వొచ్చు కానీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రం ఖచ్చితంగా కట్టిస్తాం. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడినట్లు.. గత ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాయి. పేదలను దృష్టిలో ఉంచుకొని పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలు అందిస్తున్నాం.
సనత్ నగర్‌లో ఉన్న 55 పార్కులను త్వరలోనే అభివృద్ధి చేయబోతున్నాం. గత ప్రభుత్వాలలో నేను మంత్రిగా ఉన్నపుడు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు నిధులు అడిగినా అప్పటి ముఖ్య మంత్రులు ఇవ్వలేదు. ఇప్పుడు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ సనత్ నగర్ కోసం రూ. 800 కోట్లు కేటాయించారు’ అని మంత్రి తలసాని అన్నారు.

For More News..

నవంబర్ 15న శబరిమల ఆలయం ఓపెన్.. దర్శనానికి నిబంధనలివే..

సీఐ పెట్రోలింగ్ వాహనంతో పారిపోయిన తాగుబోతు

తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు