ప్రోటోకాల్ ప్రకారం సీఎం రావాలని ఎక్కడా లేదు

ప్రోటోకాల్ ప్రకారం సీఎం రావాలని ఎక్కడా లేదు

ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాలని ఎక్కడా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతినిధిగా ఎవరైనా రావొచ్చని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని మోడీకి స్వాగతం పలికారు. భారత్ బయోటెక్ కు ప్రధాని వచ్చినప్పుడు  ప్రొటోకాల్ అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా జెండాలు పెట్టుకోవచ్చని..రాష్ట్రపతి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకు తాము మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. మోడీ గద్దెదిగాలని విపక్షాలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. ఇక బీజేపీ నేతల భాష సరిగ్గా లేదన్న ఆయన..బీజేపీవాళ్లకు తెలంగాణ ఏం తెలీదని విమర్శించారు.

బీజేపీ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ మీద ఫ్లేక్సిలు పెట్టిన తర్వాతే తాము పెట్టామని తలసాని అన్నారు. రోజు హైదరాబాద్ కు ఎంతోమంది పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు...వీళ్లు కూడా అంతేనని ఎద్దేవా చేశారు. యశ్వంత్ సిన్హా ర్యాలీ అనేది మేము చూపించిన చిన్న శాంపిల్ మాత్రమేనని..సీబీఐ, ఈడీలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని బీజేపీ కుట్రలతో కూల్చేసిందని..అయితే ఆ పరిస్థితి తెలంగాణలో ఉండదన్నారు. అసలు రాష్ట్రంలో బీజేపీ బలం ఎంతని ప్రశ్నించారు. దేశంలో ప్రజలు ముందస్థు ఎన్నికలు కావాలి అంటున్నారని..దానికి తాము రెడీగా ఉన్నామని తలసాని స్పష్టం చేశారు.