సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్రు

సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్రు

హైదరాబాద్: పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 17న ఎన్టీఆర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం  జీవో జారీ చేసిన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి, దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సీఎం  కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.