మా కార్యకర్తలు ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్ల ఉంటది : మంత్రి తలసాని

మా కార్యకర్తలు ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్ల ఉంటది  : మంత్రి తలసాని

తెలంగాణలో బీజేపీ గాలి బుడగ లాంటిదని.. కాంగ్రెస్ అంతరించిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో 20 యేండ్ల వరకు గులాబీ జెండనే ఉంటుందన్నారు. గుజరాత్ ను మోడీ అభివృద్ధి చేస్తే ఎన్నికల్లో గల్లి గల్లి ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎవరి తాటాకు చప్పుళ్లకు బెదరదన్నారు. మొన్న మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు.. సీఎం కేసీఆర్ ను బెదిరించే విధంగా మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు.  

మంత్రి మల్లా రెడ్డి ఇంటికి వెళ్ళిన ఐటీ అధికారులు ఆయన ఫోన్ ఎట్లా లాక్కుంటరని మంత్రి తలసాని మండిపడ్డారు. ఆయన కొడుకు హాస్పిటల్ లో ఉంటే కూడా వదల్లేదన్నారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది.. రేపు రేపు మాకు కూడా సమయం వస్తది అని తలసాని హెచ్చరించారు. మా కార్యకర్తలు 60 లక్షల మంది ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది..  ఊహించుకొండి అని తెలిపారు.