థియేట‌ర్లు మూసే ఆలోచ‌న లేదు

V6 Velugu Posted on Dec 03, 2021

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న క్రమంలో మాల్స్ తో పాటు థియేట‌ర్స్ మూసివేస్తార‌ని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించారు  తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. థియేట‌ర్ల మూత‌, ఆక్యుపెన్సీ త‌గ్గింపు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని తెలిపారు. అలాంటి ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వానికి లేవ‌ని  స్ప‌ష్టం చేశారు. అంతేకాదు టికెట్ల ధరలు కూడా తగ్గించబోమన్నారు.

ఇదే విషయంపై  ప‌లువురు సినీ ప్ర‌ముఖులతో భేటీ అయ్యారు తలసాని. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించారు.

Tagged Minister Talasani Srinivas Yadav, movie theaters, Closing, intention

Latest Videos

Subscribe Now

More News