క్యాసినో, గ్రానైట్ స్కాం కేసులో ముమ్మరంగా ఈడీ దర్యాప్తు

క్యాసినో, గ్రానైట్ స్కాం కేసులో ముమ్మరంగా ఈడీ దర్యాప్తు

కేసినో కేసులో ఈడీ విచారణకుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లను అధికారులకు సమర్పించారు. ఇదే కేసులో మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవందర్ రెడ్డి ఇవాళ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసుకు సంబంధించి తలసాని బ్రదర్స్ తో పాటు ఎల్ రమణను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. విచారణ మధ్యలో రమణ అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

మరోవైపు గ్రానైట్ కేసులోనే దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. విదేశాలకు గ్రానైట్ బ్లాక్ల ఎక్స్పోర్ట్ అవకతవకలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ గ్రానైట్ కంపెనీల యజమానులను ఇవాళ ప్రశ్నించనున్నారు. విదేశాలకు గ్రానైట్ అక్రమ రవాణాతో పాటు ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదుపై ఈడీ ఆరా తీస్తోంది.