
తెలంగాణ వచ్చాకే మన పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. సదర్ ఉత్సవాల్లో పాల్గొనే 6 దున్నపోతులను ఖైరతాబాద్ నుండి మారేడ్ పల్లిలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చి సందడి చేశారు యాదవులు. 2, 3 నెలల్లో రాష్ట్రంలో మేలు రకం గేదెల ఉత్పత్తి కోసం హర్యానా నుంచి మహాదున్న పోతులను తీసుకొస్తామని చెప్పారు.