గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అవసరం

గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అవసరం

మన దేశంలో ఆటలకు సరైన ప్రోత్సాహం లభించకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం తెలంగాణలో పత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకుని రాబోతున్నామన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ పేరుతో ఎల్బీ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన పది పురుషల, పది మహిళల టీమ్స్ పాల్గొంటాయని మంత్రి తెలిపారు. గెలుపోటములకు అతీతంగా అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ పోటీల్లో విన్నర్స్, రన్నర్స్ కు ట్రోఫీతో పటు నగదు బహుమతులను కూడా అందించనున్నట్లు తెలిపారు. విజేతలకు తన సొంత నగదు నుంచి రూ. లక్ష చొప్పున ఇస్తానని చెప్పారు.

గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం..

మన దేశంలో ఆటలకు సరైన ప్రోత్సాహం లేదని, అయితే తెలంగాణ ఏర్పడ్డాక క్రీడలకు పెద్దపీట వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చేదుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన  సబ్ కమిటీని వేశారని గుర్తు చేశారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని అన్నారు. క్రీడాకారులతో పాటు కోచ్ లకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పారు. గ్రామీణ క్రీడల్ని గౌరవిస్తూ.. వాటికి మరింత ప్రోత్సహం అందయించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మేడారం జాతరకు యాప్.. అన్ని వివరాలు ఫోన్​లోనే

ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్ 

వాలంటైన్స్ డే నాడు ఒక్కటైన ట్రాన్స్ జెండర్ జంట