
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతిపక్షాలు ఎన్నికల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, TRS కే జనం పట్టం కడతారని అన్నారు. పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు టికెట్లు రాకపోతే ఆవేశపడొద్దని చెప్పారు. టికెట్లు రాని నేతలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వాళ్లే నష్టపోతారని సూచించారు మంత్రి. తాండూరు లో నేతల విబేధాలను సమన్వయం చేసామని చెప్పారు. తర్వాతి సీఎం కేటీఆర్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన తలసాని.. కొందరిలా కేటీఆర్ డమ్మీ నాయకుడు కాదని..కేటీఆర్ తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారన్నారు. సరైన సమయంలో ప్రజల ఆమోదంతోనే జరగాల్సింది జరుగుతుందన్నారు.