కేటీఆర్‎నే తట్టుకోలేవు.. కేసీఆర్‎ని ఏం తట్టుకుంటయ్

కేటీఆర్‎నే తట్టుకోలేవు.. కేసీఆర్‎ని ఏం తట్టుకుంటయ్

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జలవిహార్‎లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విపక్షాలకు కేటీఆర్‎ని తట్టుకునే శక్తి లేదు.. కేసీఆర్‎ని ఏం తట్టుకుంటారని అన్నారు.

‘తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ నుంచి చాలా మంది పాల్గొన్నారు. హైదరాబాద్‎లో జరిగిన అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడ్తున్నారు. బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయింది. ప్రజాస్వామ్యంలో ఇది ఇబ్బందిగా మారింది. మన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలి. ఇతరులు మాట్లాడారని మనం మాట్లాడొద్దు. హైదరాబాద్‎లో మంచి నీటి కొరత లేదు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు డబుల్ బెడ్ రూమ్స్ పై బుద్ధి లేకుండా మాట్లాడ్తున్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను తీసుకెళ్లి చూపించాను. విపక్షాలు శృతి మించితే.. మేం తిరగబడితే మీరు హైదరాబాద్‎లో తిరగరు. మాకు ఉన్న క్యాడర్ హైదరాబాద్‎లో ఏ పార్టీకి లేదు. మనం అందరం ఇక్కడ నుంచి బయలుదేరితే విపక్షాలు ఉంటాయా? విపక్షాలకు కేటీఆర్‎ని తట్టుకునే శక్తి లేదు.. కేసీఆర్‎ని ఏం తట్టుకుంటారు. మన తప్పిదాల వల్లే గ్రేటర్‎లో కొన్ని స్థానాలు ఓడిపోయాము. టిక్కెట్ల విషయంలో మా ప్రమేయం లేదు. అన్ని నివేదికల ఆధారంగానే అధిష్టానం టిక్కెట్లు కేటాయించింది. అందరికన్నా పెద్ద హిందువు కేసీఆర్ మాత్రమే. ఆయన ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేశారు’ అని మంత్రి తలసాని అన్నారు.