
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేయడం ఉత్తమ్‌లాంటి నాయకులకు తగదని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.