ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలతో మంత్రి తుమ్మల భేటీ

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలతో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కీలక నేతలతో శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులు విజయం సాధించడానికి వ్యూహాలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల బాధ్యత తదితర అంశాలపై చర్చించారు. 

సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే.మహేందర్‌రెడ్డి, హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్, నరేందర్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.